Silk and shiny hair
సిల్క్ అండ్ షైనీ హెయిర్
సిల్క్ అండ్ షైనీ హెయిర్:
కొంతమంది జుట్టు మృదువుగా షైనీగా ఉండటానికి బయట డబ్బులు ఖర్చుపెట్టి ఏవేవో ప్రొడక్ట్స్ కోని వాడుతుంటారు. కానీ అవి మంచి ఫలితం రాకపోగా ఉన్న జుట్టు కూడా పాడయిపోయి జూట్టు ఉడటం మొదలవుతుంది. ఇపుడు ఇంట్లో ఉండేవాటితోనే నాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా సిల్క్ అండ్ షైనీ హెయిర్ సొంతం చేసుకోడానికి హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్దాలు:
- అరటిపండు - ఒకటి
- ఎగ్ వైట్ - ఒకటి
- తేనె - 2 స్పూన్లు
- కొబ్బరి నూనె -2 స్పూన్లు
తయారు చేసే విధానం:
ఒక అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని అందులో ఒక చిన్న కప్పు పచ్చిపాలు మరియు ఒక కోడి గుడ్డులో పసుపు సొన కాకుండా తెల్లగా ఉన్న దాన్ని వేసి అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె మరియు రెండు స్పూన్ల తేనెను వేసి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసి జుట్టును చిన్న చిన్న పాయలుగా చేసి మొత్తం చివరివరకు పట్టించి ఒక గంట సేపు అలాగే వదిలేసి తలస్నానం చేయాలి.
ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి వేసుకోవచ్చు.
ఉపయోగాలు:
ఇలా చేసిన తర్వాత జుట్టు చాలా సిల్కీగా షైన్ గా ఉంటుంది.
ఇంట్లో వాడే పదార్దాలతోనే వాడటం వల్ల బయట వాటిలో ఉన్నట్టు కెమికల్స్ ఏమి ఉండవు.
- ఈ ప్యాక్ ని డ్రై హెయిర్ వారు వాడొచ్చా?
ఈ ప్యాక్ ని ఎవరైనా వాడొచ్చు.
- తేనె జుట్టుకి రాయడం వల్ల వెంట్రుకలు తెల్లగా అవుతాయి కదా?
జుట్టుకి రాయడం వాళ్ళ తెల్లగా ఏమీ అవ్వదు ఇంకా చివర్లు పగలకుండా చూస్తుంది. మోయిశ్చరైజెర్ గా పనిచేసి షైన్ ని కూడా ఇస్తుంది.


Post a Comment
0 Comments