జీవితంలో విజయం కంటే దాని కోసం చేసే ప్రయత్నమే గొప్పది
ఒక చిన్న మాట గుండె లోతుల్లోకి దిగిపోయే మాట ఆ ఒక్క చూపు చురుక్కుమని మనసుకు తగిలి కళ్ళు ముసుకున్న వెంటాడే తట్టుకోలేని చూపు ఓ మనిషి ప్రవర్తన జీర్ణించుకోలేక ఈ మనిషేనా మన పట్ల ఇలా ప్రవర్తించింది అని ఎంత వద్దనుకున్న మళ్లించుకోలేని దైన్య స్థితి. అన్ని తీసుకోండి మనసుకు. మనసారా బాధపడండి. కరువు తీరా కన్నీళ్లు కార్చండి. మన మనస్సు లోతు ఎంతో ఆ వేదనలో కొలతలు వేసుకోడానికి అన్యాయమైపోయామని దగా పడ్డామని కుమిలిపోడానికి ఆ బాధను వాడేసుకోండి. ఐదంటే ఐదే నిమిషాల్లో అంతా ముగిసిపోవాలి. ఆ ఐదు నిమిషాల తర్వాత బాదనేదే ఉండకూడదు. ఎంత బాధపడతారో ఎంత కృంగి పోతారో ఆ ఎక్స్ట్రీమ్కి కూడా అనుభవిoచేయండి. గట్టిగా ఉపిరి పిల్చండి ఇపుడు లోనికెళ్లిన శ్వాస మాత్రమే ఉంది. ఆ ఒక్క శ్వాస తోడుంటే ఆఫ్ట్రాల్ మిగతవన్ని ఓ లెక్కా..! మాటల్లేవ్ చూపుల్లేవ్ బిహేవియర్లు లేవు ఒక్కటే అన్ని చెరిపేసిన పలక లాంటి శుభ్రమైన మనస్సు. మనుషులంతే ఉప్పు కారము తింటారు. పాని పూరీలు మిర్చి బజ్జిలు కూడా డబ్బు ధర్మము వెనకేస్తారు. ఈర్ష అసూయాలతో రగిలిపోతారు. కోపావేశాలతో రగిలించేస్తారు. ఆ మాత్రానికేనా లైట్లన్నీ ఆర్పేసుకుని ఓ మూలన ఇరుక్కుపోయి బక్కిట్ల కొద్దీ కన్నీళ్లు కార్చేస్తు కుమిలిపోయేది. మనుషులే కాదు పరిస్థితులు కొన్ని సార్లు పగబడతాయి. చూస్తూ... ఉండడమే ప్రేక్షుకుల్లా వాటి టైం అయిపోగానే అన్ని సర్దేసుకుంటాయ్.ఎంత ఎమోషనల్ అయితేనే అంత డిస్టర్బ్ అవుతాం. ఇంకా పరిస్థితి దిగజారిపోతోంది.
మిత్రమా... అన్నీ బాగున్నపుడు కాలర్ ఎగరేయడం కాదు ఏది బాగోలేనపుడు కూడా మనసుకి తీసుకోకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండిపోడం. ఏ చూపు ముళ్లులా గుచ్చుకున్న అది గాయంలా మారెలోపు ఆ ముళ్ళు పీకేయకపోతే ప్రతీ చూపు ముళ్లుగానే మారుతుంది. తట్టుకోలేని గాయలయిపోతుంటాయి. ఈ జీవితాంతం దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరెకె... అంతవరెకె తీసుకుంటె చాలు ఈ జీవితానికి. మిత్రమా... చివరిగా ఓ అక్షరసత్యాన్ని చెప్పనా ని జీవితంలో ఏది శాశ్వతం కాదు.


Post a Comment
0 Comments