బొప్పాయి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు helpful hearts one

 బొప్పాయి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి షుగర్ పేషెంట్స్కి మధుమేహం ఉన్నవారికి ఎంతో శ్రేష్టం. బొప్పాయిలో విటమిన్ A మరియు C  కూడా   ఉంటుంది. విటమి A  ఉండటం  వల్ల కంటిచూపు మెఱుగుపడుతుంది. రేచీకటి రాకుండా ఉంటుంది. విటమిన్ C  కూడా చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ముఖం కూడా చూడటానికి కళగా ఉంటుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉంటాయి. గోర్లు నున్నగా పగుళ్లు లేకుండా పుచ్చుపోకుండ అందంగా ఉంటాయి. ఈ గోర్ల ఆరోగ్యానికి కూడా విటమిన్ A,C  చాల బాగా ఉపయోగపడతాయి. విటమిన్ C రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. 

             


 ఈ మధ్యకాలంలో వచ్చే మహమ్మారి  వైరస్ల నుండి కూడా కాపాడటానికి విటమిన్ C  కీలకపాత్ర వహిస్తుంది. అంతేకాకుండా C విటమిన్  చిగుళ్ల నుండి రక్తం కారుతున్న వాళ్ళకి దానిని నియంత్రించడానికి దంత ఆరోగ్యానికి దోహదపడుతుంది. శరీరం మీద ఎక్కడైనా గాయాలు తగిలిన లేదా ఆపరేషన్స్ చేసిన పుండ్లు మానాలంటే విటమిన్  C  ఎంతో కీలకపాత్ర వహిస్తుంది.
                బొప్పాయిలో పీచుపదార్థం ఉంటుంది. పీచుపదార్థం జీర్ణ శక్తిని ప్రేరేపించి జీర్ణం సాఫిగా అవ్వడానికి జీర్ణరసాల ఉత్పత్తిలో ఉపయోగడుతుంది. ఈ పీచుపదార్థం మలబద్దకం పోయేలా చేస్తుంది. మొలలు,అరిసేమొలలు దరిచేరవు . మలబద్దకం లేనివారికి పేద్ద ప్రేగు కాన్సర్, మలాశయం కాన్సర్ రాదు అని పరిశోధకులు వెల్లడించారు. పీచు పదార్థం వల్ల  రక్తంలో చెడు కొలెస్ట్రాల్ LDL  కొలెస్ట్రాల్ యొక్క పరిణామం తగ్గుతుంది.  ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గిందో గుండెపోటు, పక్షపాతం రాదు. చేడు  కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా ఉపయోగడుతుంది. అటువంటి విశిష్ట గుణం కలది ఈ బొప్పాయి. 

               చంటి పిల్లలికి 6వ నెలలో అన్న ప్రాసన చేస్తారు. అపుడు మెత్తగా ఉండే అన్నం ,బంగాళాదుంప, టమాటో బాగా మెత్తగా చేసి పెడతారు.  6వ నెల నుండే బాగా పండిన  బొప్పాయిని మెత్తగా చేసి పెట్టవచ్చు. వారు చక్కగా దాని ఆస్వాదిస్తారు.  ఆరోగ్యకరంగా ఉంటుంది. 
               గర్భిణీ స్త్రీలు బొప్పొయిని చూసి బయపడిపోతుంటారు. పచ్చి బొప్పాయిని కొంతమంది కూర వండుకుంటారు. పచ్చి బొప్పాయిలో పెపెన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది గర్భశయ కండరాలను ప్రేరేపిసుంది. అందుచేత గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయిని తినకూడదు. అంతేకాని బాగా పండిన బొప్పాయి తింటే ఎటువంటి ప్రమాదం లేదు. అందుచేత గర్భిణీ స్త్రీలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బొప్పాయి బాలింతలకు పాల ఉత్పత్తి పెంచి పిల్లలకు సమృద్ధిగా పాలు అందేలా చేస్తుంది. 
               బొప్పాయి పండులో విటమిన్A, C  లు ఉండటం వలన పెద్దవయసు వారికి వృద్ధాప్య ఛాయలు కనబడకుండ చేస్తుంది. అంటే ముఖం మీద ముడతలు రాకుండా, చర్మం మీద ముడతలు రాకుండా చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా పొడిబారకుండా కాపాడుతుంది. ఈ బొప్పాయి పండు తిన్న తర్వాత ఎక్కువ ఆకలిగా కూడా అనిపించదు. 
ఇన్ని విటమిన్లు సూక్ష్మపోషకాలు ఉన్న బొప్పాయి ఎంతో శ్రేయస్కరమైన పండు.  

Post a Comment

0 Comments