strong hair
ఒతైన కురుల కోసం
- వేడినీళ్ళను తలస్నానం కి అస్సలు వాడకూడదు. నార్మల్ వాటర్ లేదా చల్లగా ఉండే నీళ్లను అయినా వాడవచ్చు
. - కొంతమంది చిక్కులు తీయకుండ తల స్నానం చేసి ఆ తర్వాత తీద్దామనుకుంటారు. కానీ చిక్కులన్ని తీసిన తర్వాతనే తల స్నానం చేయాలి. లేదంటే వాటర్ పడిన వెంటనే ఇంకా చిక్కులు పడిపోయి చాల డెలికేట్ అయిపోతుంది. జుట్టు తడిగా ఉన్నపుడు అస్సలు దువ్వకూడదు. చిక్కు తీసేటపుడు ముందుగా పైనుండి కాకుండా కింద నుండి తీసుకుంటు పైకి వెళ్ళాలి. తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తప్పకుండా వాడాలి.
- వారానికి ఒక్కసారైనా మంచి హెయిర్ ప్యాక్ వాడాలి.
- తలస్నానం చేసిన తర్వాత టవల్తో జుట్టుని గట్టిగా కొట్టడం కానీ రుద్దడం కానీ చేయకూడదు.
- ప్రతి రోజు ఆయిల్ పెటుకున్నా పెటుకోకపోయిన 5 నిముషాలు పాటు మర్దన చేయాలి.
- జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఫై పూతలే సరిపోవు. ఆహార విషయంలో కూడా శ్రద్ధ వహించాలి.


Post a Comment
0 Comments