ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం ఎలా
ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం ఎలా ?
ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం ఎలా ?
ఓవర్ వ్యూ :
- ఇంట్రడక్షన్
- క్లేన్సింగ్
- స్క్రబ్బింగ్
- ప్యాక్
ఇంట్రడక్షన్:
మనం ఇంట్లోనే పెడిక్యూర్ చేయడం ఎలా అనే దాని గురుంచి నేర్చుకోబోతున్నాం. మనం ఇంట్లో ఉండేవాటితోనే చాల సింపుల్ గా ఎటువంటి ఖర్చులేకుండా డీటాన్ మరియు పాదాల మెరుపు మీ సొంతం.
దీనిని మీరు పదిహేను రోజులకొకసారి చేసి చూశారంటే మీ పాదాలు మృదువుగా అయ్యి డెడ్ సెల్స్ అన్ని పోతాయి. మీరు మీ కాళ్ళను రెగ్యులర్గా కేర్ చేయడం నేర్చుకోవాలి.
క్లేన్సింగ్ :
మొదటగా మీ గోళ్లకు నెయిల్ పోలిష్ ఉంటె నెయిల్ రిమూవర్ తో క్లీన్ చేయాలి.
ఒక చిన్న బౌల్లో కొద్దిగా పాల మీగడ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పోసి బాగా కలిపి మీ కాళ్ళకు రాసుకుని ఐదు నిమిషాల వరకు మసాజ్ చేయాలి.
ఒక బకెట్లో గాని చిన్న ట్యూబ్లో గాని కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లను తీసుకుని అందులో రెండు స్పూన్ల బేకింగ్ సోడా (వంట సోడా) మరియు రెండు నుండి మూడు స్పూన్ల షాంపూ కూడా తీసుకుని ఇపుడు ఈ వాటర్లో పెరుగు మిశ్రమ తో మసాజ్ చేసిన కాళ్లను ఇందులో పదిహేను నుండి ఇరవై నిముషాలు ఉంచాలి. ఇపుడు డెడ్ స్కిన్ మరియు క్యూటికకల్స్ మృదువుగా తయారవుతాయి. అందులో నుండి కాళ్ళు తీసి క్యూటికల్ రిమూవర్ తో క్యూటికల్స్ ని మెల్లిగా తీసి గోళ్లను కట్ చేసి శుభ్రం చేసుకోవాలి.
స్క్రబ్బింగ్:
ఒక ఫూట్ స్క్రబ్బర్ లేదా ప్యూమిక్ స్టోన్ గాని తీసుకుని దాని మీద కొంచెం షాంపూ వేసి మీ కాళ్ళని మంచిగా స్క్రబ్ చేసుకోండి మొత్తం డెడ్ స్కిన్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి చాల ఈజీగ వచ్చేస్తుంది. తరువాత ఒక టవల్తో కళ్ళను తుడిచేయాలి.
ప్యాక్:
సెనగపిండి, పెరుగు, పసుపు ఈ మూడింటిని ఒక పేస్ట్ చేసి కాళ్లకు పూసి పదిహేను నుండి ఇరవై నిముషాలు ఆలా వదిలేసి ఆరిన తర్వాత శుభ్రం కడిగి మొయిశ్చరజైర్ రాసి మొదట సుతి మెత్తం గా తర్వాత కాస్త గట్టిగా మసాజ్ చేయాలి. ఇపుడు నెయిల్ పోలిష్ వేసుకోవాలి. అంతే పెడిక్యూర్ పూర్తయినట్టే.
టిప్:
ప్రతి రోజు స్నానం చేసేటపుడు foot scrub తో ఒక రెండు నిముషాలు సమయం దాని కేటాయిస్తే ఎక్కువ డెడ్ స్కిల్స్ పేరుకుపోకుండా ఉంటుంది. అపుడు కళ్ళు పగుళ్లు కూడా ఉండవు.
పెడిక్యూర్ వల్ల ఉపయోగాలు:
చాల రిలాక్సింగ్ గా ఉంటుంది.
డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది.
బ్రైటనింగ్ పెరుగుతుంది.





Post a Comment
0 Comments