ఇంట్లోనే బొప్పాయి ఫేషియల్ helpfulheartsone

ఇంట్లోనే  బొప్పాయి ఫేషియల్ 


ఇంట్లోనే బొప్పాయి పండుతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికన్నా ముందు అసలు బొప్పాయి పండు వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అందరికి అందుబాటులో ఉండే ఈ బొప్పాయి పండులో అనేక రకాల విటమిన్లు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ A ,C,E పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు పెపెన్ అధికంగా ఉంటాయి. ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే బొప్పాయి ఉపయోగాలు అనే ఆర్టికల్ ఉంది మనది అది ఒకసారి చదవండి. ఎంతో సులువుగా ఇంట్లో దొరికే ఇతరపదార్థాలతో అందాన్ని మీ సొంతం చేసుకునే ఈ బొప్పాయి ఫేషియల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

మీకు తెలుసుకదా ఫేషియల్ అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి.

క్లేన్సింగ్

ఒక తే స్పూన్ బొప్పాయి పేస్టుని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ను వేసుకుని బాగా కలిపి మీ ముఖానికి రాసుకోండి. ముఖం మీద  ఉండే మురికి, ఎండకి నల్లగా మారిన చర్మం మాములుగా రావడాన్ని, గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది. రెండు  నిముషాలు చేతులతో మసాజ్ చేస్తూ నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. 

స్క్రబ్బింగ్ 

ఫేషియల్లో ఇది చాలా  ముఖ్యం. ఒక చిన్న గిన్నెలో ఒక టీ స్పూన్ బొప్పాయి  పేస్ట్, ఒక టీ స్పూన్ పంచదారను వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఎక్కువ ప్రెసర్ ఇవ్వకుండా మూడు నుండి నాలుగు నిముషాలు  స్క్రబ్ చేయండి. పంచదార ఎక్సఫోలియేట్ గా బాగా పనిచేస్తుంది. పంచదార కాకుండా ఇక్కడ బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. 

మొయిశ్చరైజర్ 

ఇది రాసుకోవడం వల్ల పొడిబారిన చర్మం వారికీ మంచి ఫలితం ఉంటుంది. ఒక టీ స్పూన్ బొప్పాయి పేస్టుని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పచ్చిపాలను వేసి అలాగే ఒక టీ స్ప్పోన్ తేనెను కూడా వేసి బాగా కలిపి ముఖానికి రాసి సర్క్యూలర్ మోషన్ లో అయిదు నిముషాలు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పట్టి మంచి గ్లో వస్తుంది. నార్మల్గా రోజు కూడా పచ్చి పాలతో మసాజ్ చేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

పేస్ ప్యాక్ 

ఒక టీ స్పూన్ బొప్పాయి పేస్టుని తీసుకుని అందులో పెరుగు ఒక టీ స్పూన్ మరియు ఒక టీ స్ప్పోన్ శెనగపిండి వేసుకుని బాగా కలిపి చక్కగా  ముఖం అంతా రాసుకుని ఐదు నుండి పది నిముషాలు ఉంచుకుని ఆరిన తరువాత కడిగేసుకుని ఐస్ క్యూబ్స్ ని పెట్టుకోండి. వీటిని నార్మల్ వాటర్ తో అయినా రోజే వాటర్తో అయినా చేసుకోవచ్చు. 

Post a Comment

0 Comments