ఓపెన్ పోర్స్ తో బాధపడుతున్నారా ?helpfulheartsone
ఓపెన్ పోర్స్ తో బాధపడుతున్నారా ?
ఓపెన్ పోర్స్ అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి? ఓపెన్ పోర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు మనం తెలుసుకుందాం
ఓపెన్ పోర్స్ అంటే?
మన ముఖంలో ఆయిల్ గ్రంధులు ఉంటాయి. అంటే సబేషియస్ గ్రంధులు ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసిన ఆయిల్, చెమటంతా కూడా బయటికి వచ్చి చర్మం తాజాగా ఉంటుంది. ఎలా బయటకు వస్తుంది చిన్న చిన్న రంద్రాలు ద్వారా అంటే మన ముఖం అంతా చిన్న చిన్న రంద్రాలు ఉంటాయి. వాటినుండి బయటకి వస్తుంది. ఈ బయటకొచ్చే విధానంలో ఏర్పడుతున్న సమస్యలే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్, ఓపెన్ ఫోర్స్ .
మనకి నార్మల్ గా చెమట గాని, ఆయిల్ గాని ఉత్పత్తి అవుతుంది కదా ఈ ఉత్పత్తి జరిగినపుడు రంద్రాలు నుండి బయటకొస్తుంటాయి. ఇలా బయట కొచ్చేటపుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఏవైనా దుమ్ము, దూళి ఉంటే పూర్తిగా రంద్రం తెరుచుకోకుండా అది బయటకి రాకుండా జరిగిన సందర్భాలలో కొంచెం బయటికి వచ్చి పైకి కనిపించి అవి తెల్లగా ఉండిపోయి బయటకు రాకుండా పూర్తిగా గట్టిబడి పోయి తెల్లగా ఉంటాయి. వాటినే వైట్ హెడ్స్ అంటారు. ఎక్కువ మనకి ముక్కు మీద, బుగ్గల మీద, గడ్డం మీద ఉంటాయి. వాటిని గట్టిగా నొక్కి పిండితే బయటకు వచ్చేస్తుంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. కొంతవరకు బయటకు వచ్చేటువంటి చెమట కానీ ఆయిల్ కానీ ఏమవుతుందంటే పోరు లో బ్లాక్ అయిపోతుంది. గట్టి పడిపోతుంది. బయట పొల్యూషన్ గాలి వీటన్నిటికీ కూడా ఆక్సిడైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిడైజ్ అవుతుందో అది కలర్ మారిపోయి బ్లాక్ గా అయిపోతుంది. ఈ నల్లగా ఒక మచ్చలా అయినటువంటి దాన్ని గట్టిగ స్టీమ్ ఇచ్చి కొమడైన్తో ప్రెస్ చేసి ఫ్యాషియల్ చేసేటపుడు తీస్తారు. దాన్నే బ్లాక్ హెడ్ అంటారు.
ఇంకొకటి ఈ రంద్రం లోపల సెబమ్ బయటికొచ్చేటపుడు కొన్ని సార్లు అడ్డుపడుతుంది. . అడ్డుపడినది బయటికి రాకుండా లోపలి రాకుండా చర్మంమూసుకుపోతుంది. ఎప్పుడైతే చర్మం మూసుకుపోతుందో అపుడు లోపల ఒక బాక్టీరియాతో కలిసి వాచిపోతుంది . పైకి నెట్టి ఒక పొరలాగా ఉండిపోతుంది చర్మం. అపుడు నెప్పిగా ఇబ్బందికరంగా ఉండి లోపల చీములాగా తయారవుతుంది బాక్టీరియాతో దాన్నే పింపుల్ అంటాం . ఈ పింపులే ముదిరి స్టేజి మారితే యాక్ని అవుతుంది. ఇన్ని రకాలుగా ఈ ఫోర్స్ లోపల నుంచి చెమట, ఆయిల్ బయటకొచ్చేటపుడు ఈ సమస్యలు ఎదుర్కొంటాం.
అయితే ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అయ్యి బయటకు వస్తుంటే ఒకేసారి ఎఎక్కువ ఆయిల్ ని బయటకు పంపిస్తుంది. అపుడు రంద్రం అనేది తెరుచుకుంటుంది. తెరుచుకున్నాక అందులో నుండి అలాగే ఆయిల్ వస్తూ ఉంటే తెరుచుకున్న రంద్రాలు ఏమైతే ఉన్నాయో అవి అలానే ఉండిపోతాయి మల్లి మూసుకోకుండా దాన్నే ఓపెన్ పోర్ అంటారు. ఇది ఎక్కువుగా హార్మోన్స్ అనేవి మారుతున్నప్పుడు అంటే వయసుకు వస్తున్నా సమయంలో చర్మతత్వం అనేది బయటపడుతుంది. చిన్న పిల్లలు అందరికి చర్మం మృదువుగా ఒకేలా ఉంటుంది. కానీ వయసు మారుతున్న కొద్దీ 10 సంవత్సరాల నుండి చర్మ తత్త్వం మారుతుంటుంది. జన్యు ప్రభావం వల్ల గాని వారు తీసుకుంటున్న ఆహారం వల్ల గాని చర్మ తత్త్వం బట్టి మారుతుంటుంది.
ఓపెన్ పోర్స్ కి జాగ్రత్తలు
ఓపెన్ పోర్స్ అనేవి మొత్తానికి రాకుండా ఉండాలంటే ఆయిల్ ఉత్పత్తి లేకుండా చూసుకోవాలి. అస్సలు ఆయిల్ ఉత్పత్తి లేకుండా చూసుకుంటే మన చర్మంలో వేస్ట్ అంతా బయటికి రాదు. ఆయిలీ స్కిన్ వారి యొక్క చర్మ తత్త్వం చాలా మంచిది. ఎందుకంటే స్కిన్లో మొయిశ్చర్ ఉంటుంది. సెబమ్ రిలీస్ అవ్వాలి. కానీ ఎక్కువగా అయితే సమస్యలు వస్తాయి. ఎక్కువ ఆయిల్ రాకుండా చూసుకుంటే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఓపెన్ పోర్ కి శాశ్వత పరిష్కారం అనేది లేదు. కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ సమస్య రాకుండా ముందుగా గుర్తించి నా చర్మ తత్వానికి పోర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రతపడదాము అని జాగ్రత్త పడవచ్చు. అలాగే చిన్నగా ఇపుడే స్టార్ట్ అయితే అవి ఇంకా పెరగకుండా మనం చూసుకోవచ్చు.
- చాల మృదువుగా ఉండేటివంటి క్లేన్సెర్ ని వాడాలి.
- స్క్రబ్బింగ్ని ఎక్కువుగా చేయకూడదు. ఆయిల్ గ్లాండ్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి ఆయిల్ ఎక్కువ బయటకి వచ్చి రంద్రం అనేది తెర్చుకుంటుంది.
- ఎండలోకి వెళ్ళేటపుడు సన్ స్క్రీన్ లాంటివి వాడాలి.
- మేకప్ని రాత్రుళ్ళు క్లేన్సెర్తో కానీ మేకప్ రిమూవర్ తో గాని రిమూవ్ చేసి పడుకోవాలి.
- సాలిసిలిక్ ఆసిడ్ ఉన్నటివంటి పేస్ వాష్ ని కానీ సీరంలను కానీ వాడితే ఎక్కువగా ఆయిల్ రాకుండా ఉంటుంది.
- ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్లు ఎక్కువగా క్లే మాస్క్లు వేసుకోవచ్చు. దీనివల్ల సాగినా చర్మం బిగుతుగా అవుతుంది. ప్యాక్ వేసుకున్న తర్వాత తప్పకుండ మొయిశ్చరైజర్ రాయాలి.
- తీసుకునేటివంటి ఆహారం మంచిగా తీసుకోవాలి స్కిన్ యొక్క కొల్లాజిన్ని పెంచేటి వంటి వాటిని తీసుకోవాలి. ఆయిల్ ఉత్పత్తి చేసే ఆహారాన్ని దూరం పెట్టాలి. అవేంటంటే డైరీ ఉత్పత్తులు గని షుగర్, స్వీట్స్, జంక్ ఫుడ్స్
- మంచినీళ్ళను ఎక్కువ త్రాగాలి.


Post a Comment
0 Comments