ఓట్స్ యొక్క ఉపయోగాలు

 ఓట్స్ యొక్క ఉపయోగాలు 

అతి తక్కువ ఖర్చుతో మనకు దొరికే హెల్తి ఫుడ్స్లో ఓట్స్ ఒకటి. బరువు తగ్గాలన్న వారికి  చాల బాగా  హెల్ప్ చేస్తాయి ఓట్స్. బరువు తగ్గాలన్న వారికీ మాత్రమే కాదు హెల్తి లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికీ ఓట్స్ చాల మంచివి. ఈ ఓట్స్ గురించి ఇంకా తెలుసుకుందాం. 

మన శరరంలో చెడు కొలెస్ట్రాల్నుతొలగించడంలో  చాల బాగా ఉపయోగపడతాయి. ఇది కొలెస్ట్రాల్ కు శత్రువు. జీర్ణవ్యవస్థ సరిగా పని చేయడానికి తోడ్పడుతుంది. ఓట్స్లో యాంటియోక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో బీటా గ్లూకోస్ ఉటాయి. ఇది ఒక రకమైన పీచు పదార్థం. బీటా గ్లూకోస్ ఉడడటం వల్ల కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ ను  కూడా దూరం చేస్తుంది. 

ఓట్స్ లో ఒకరోజుకు సరిపడా మెగ్నీషియం కేవలం 40 గ్రాముల ఓట్స్ లో ఉటుంది. మెగ్నీషియం వల్ల బిపి అదుపులో ఉంటుంది. రక్తనాళాలు కుంచించుకు పోకుండా ఆపుతుంది. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. ఓట్స్ను రోజు తినడం వల్ల డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయి రక్తంలో చక్కర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. 

ఇన్ని లాభాలున్నా ఓట్స్ ను మీ జీవితంలో ఒక బాగం చేసుకుని  చక్కని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

ఇలా రకాకలుగా తయారుచేసుకుని బోరుకొట్టకుండా తినవచ్చు. అసలు ఓట్స్ ఏవిధంగా తినాలో తెలియని వాళ్ళు సింపుల్గా  రోజు breakfast లో  ఒక గ్లాసు పాలు కాసుకొని లాస్టులో దించేటపుడు ఒక 3నిముషాలు ముందు ఒక


చిన్న  కప్పు ఓట్స్ ని అందులో వేసి స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్లు తేనె వేసుకుని తినవచ్చు. కావాలంటే  అందులో fruits (దానిమ్మ పిక్కలు, యాపిల్ ముక్కలు ) లాంటివి dry fruits  కూడా  వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.  ఇంకా ఓట్స్ ఉప్మా, ఓట్స్ ఇడ్లి, ఓట్స్ ఆమ్లెట్, ఓట్స్ దోస ఇలా చాల రకాలుగా  రోజు ఒక్కటే తిన కుండా వివిధ రకాలుగా ట్రై చేసి తినవచ్చు. 

Post a Comment

0 Comments