గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు ఏ సమయంలో తాగాలి ? Helpfullheartsone

 గ్రీన్ టీ యొక్క ఉపయోగాలు ఏ  సమయంలో తాగాలి 

గ్రీన్ టీ  రుచితో పటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గ్రీన్ టీ బరువును తగ్గించుకోడానికి మాత్రమే కాదు. దీనిని రోజూ తీసుకోడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్త్తుంది. ఇంకా అనేక ప్రయోజనాలున్నా గ్రీన్ టీ గురించి తెలుసుకుందాం. 

  • గ్రీన్ టీ మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఎన్నో రకాల వైరస్ ల నుండి రక్షిసుంది. 
  • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి గ్రీన్ టీ ఒక వరంగా చెప్పవచు. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. 

  • ఇది రక్తనాళాల్లో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. అందువల్ల గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. గ్రీన్ టీ రోజూ తీసుకోవడం ద్వారా గుండెపోటు,రక్తపోటు వంటి ప్రమాదాలు నుండి రక్షించుకోవచ్చు. 
  • శరీరంలో జరిగే మార్పుల వల్ల అనేక రకాలైన విషపర్దాలు వెలువడుతాయి. అయితే వీటివల్ల మన ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఇది విషపదార్దాలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • శరీరంలో ఏర్పడే కొవ్వును తొలగించి, తద్వారా శరీరం అధిక బరువు సమస్య బారిన పడకుండా కాపాడుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్దాలనుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ కాఫీ, టీలకు బదులు రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. 
  • గ్రీన్ టీ మధుమేహంతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో కొవ్వును నివారిస్తుంది. 

మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది. పళ్ళపై ఎనామిల్ ను  రక్షిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఇంకా శరీరాన్ని అనేక రుగ్మతల నుండి కాపాడుతుంది. 

గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం:

గ్రీన్ టీ ని ఉదయం 10 గంటలనుండి 11 గంటల మధ్యలో లేదా సాయంత్రం టైంలో తీసుకోడం వలన ఈ సమయాల్లో మెటబాలిజం రేటు పెరుగుతుంది. రెండు భోజనాల మధ్య కప్పు గ్రీన్ టీ త్రాగవచ్చు. ఆహారానికి 2 గంటల ముందు లేదా తిన్న  తర్వాత త్రాగడం వలన పోషకాలు బాగా శరీరానికి పడతాయి. అలాగే ఐరన్ కూడా చక్కగా పీల్చుకోబడుతుంది. మీరు రక్త హీనతతో బాధపడేవారు అయితే భోజన సమయాల్లో గ్రీన్ టీ  తీసుకోవద్దు. జాతియా కేన్సర్ పరిశోధన సంస్థ వారి ప్రకారం గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను ఆపేసి ఆహారం నుండి ఐరన్ను పీల్చుకోకుండా చేస్తాయి. వ్యాయామం  చేసే ముందు  గ్రీన్ టీ తాగడం వలన అందులో వుండే కెఫిన్ ఎక్కువ కొవ్వును కరిగేలా చేస్తుంది. కెఫిన్ మీ శక్తిని పెంచడం వలన ఎక్కువ సమయం వ్యాయామం చేయగలుగుతారు . మీరు నిద్రపోయే ముందు గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే అందులో ఉండే కెఫిన్ నిద్రను పాడుచేస్తుది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ మెడికల్ సెంటర్ ప్రకారం  రోజుకు 3 కప్పుల గ్రీన్ టీ లేదా 100 నుండి 750 మిల్లి గ్రాములు గ్రీన్ టీ రోజుకు సరిపోతుంది. ఎక్కువ గ్రీన్ టీ తాగడం వలన  శరీరంలోని అవసరమైన పోషకాలను కూడా బయటకు పంపిచేస్తుంది. 

Post a Comment

0 Comments