fighting is a must in life.
జీవితంలో పోరాటం తప్పదు! helpfulheartsone
జీవితంలో పోరాటం తప్పదు!
ఒక తల్లి తన బిడ్డకు జన్మ నివ్వటంలో ఎంత ఘర్షణ ఉంటుందో ఒక మనిషి విజయం వెనకాల కూడా అంతే ఘర్షణ ఉంటుంది. ఎంతో నెప్పిని బరించాలి ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి చాల బాధలను ఓర్చుకోవాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది.
ఓటమి అంటే చీకటిలో నిండిన కారడవిలో గమ్యం తెలియక నడవడమే మన దగ్గర వున్న చిరు దీపం వల్ల మనలోని చిన్న ఆశ మాత్రమే. అందులో నుండి బయట పడితే గాని తెలియదు. బ్రతుకంటే ఏంటో గెలుపంటే ఏంటో హాయిగా మంచంపైన పడుకుని అది చెయ్యాలి ఇది చేయాలి అనుకుంటే విజయం వరించదు దాని కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. నిద్రలు మానుకోవాలి బద్దకాన్ని వదులుకుని కొన్ని సంతోషాలను పక్కన పెట్టాలి. అయిన అనుకున్నది జరుగుతుందని గేరెంటి ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవచ్చు.
అలాంటపుడు ఈ ప్రయత్నాలన్ని మధ్యలోనే ఆపేయాలన్నంత కోపం కసి వస్తుంది. కానీ అలాంటి కష్ట సమయంలో ఈ ఒక్కమాట స్మరణ తెచ్చుకో అనుకున్నది చేయడం అంత తేలికైన పని అయితే దానిని ఎవరైనా చేసేస్తారు. కానీ అది అంత తేలికైన పని కాదు కదా! కాబట్టి నువ్వు మాత్రమే దాని పూర్తీ చేయాలి అపుడే ఎవరు ఊహించలేనంత ఘనత నీకు దక్కుతుంది
.
ఎప్పుడు నీ జీవితంలో నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు అలా ప్రయత్నించినంత వరకు నువ్వు గెలిచే అవకాశం ఉండనే ఉంటుంది. నువ్వు వెళ్లే దారిలో మీకు ఎంతో మంది విరోధులు ఎదురవుతూనే ఉంటారు. నువ్వు అనుకున్న పని జరగదు అని వెక్కిరిస్తారు. నీ వల్ల ఏమి కాదు అని అవమానిస్తారు. కానీ వారి మాటలను నమ్మద్దు . ఎందుకంటే అందరు నడిచే దారిలో నువ్వు నడవడం లేదు హడావిడిగా నిద్ర లేచి కంగారు కంగారుగా భోజనం చేసి ఆఫీసులో బాస్ తిట్టే తిట్లను భరించి రాత్రి నిద్రపోయే ముందు నిందించుకునే జీవితం నీకు నచ్చడం లేదు. నువ్వు మార్పు కోరుకుంటున్నావ్ కాబట్టి కొద్దిగా వింతగా చూడటం సహజమే కానీ నువ్వు అవేమి పట్టించుకోకుండా మనసునిండా ఆత్మవిశ్వాసం నింపుకుని దైర్యంగా మునుముందుకు సాగిపోవాలి.
కొంతమంది మన మంచికోసమే కొన్ని మంచి మాటలు చెబుతారు. అలాంటి వారు చెప్పే మాటలలో నిజమెంతో గ్రహించు మనలోని తప్పు ఒప్పులను ఎప్పటికపుడు సరిచేసుకుంటూ మనల్ని మనం నిత్యం మెరుగు పరుచుకోవాలి. ప్రతి మనిషి విజయం కావాలని కోరుకుంటారు కానీ కొద్దీ మంది మాత్రమే దానికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఆఖరిగా ఒకమాట విజయం అనేది ఒక్క రాత్రిలోనో లేదా ఒక్కరోజులోనో వచ్చేదికాదు మనం ప్రతిరోజు ప్రతిక్షణం చేసే పనులు తీసుకునే నిర్ణయంను బట్టి అది నిర్దారించబడుతుంది.



Post a Comment
0 Comments